TELANGANA WEB RADIO

Telangana Watch: Telangana Radio TG10 fm

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

Pro.Tangeda Kishen Rao :ఆచార్య టి.కిషన్ రావు

Pro.T.K.R :ఆచార్య టి.కిషన్ రావు
తెలుగు శాఖలో నిగర్వి......అందరినీ కలుపుకుపోయే సౌమ్యుడు 
మితభాషి ..అజాతశత్రువు ....ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత చిట్టాను ఆయన గురించి చెప్పవచ్చును...అతను ఎవరో కాదు తెలుగు శాఖలో ఎందరికో మార్గదర్శనం చేసిన ,చేస్తున్న ఆచార్యులు...మాన్యశ్రీ కిషన్ రావు గారు...
ఆచార్యులకే ఆచార్యుడు...
ఏ విషయానికీ త్రొటుపాటు పడని.. ఓ నిండుకుండ. 
ఇతను అందరికీ ఆచార్య టి.కె.ఆర్. గా సుపరిచితుడు. 
ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావ్ గారి ప్రొఫైల్  :
 

జననం:   29 - 11 -1950
స్వస్థలం : జీలుగుల (గ్రామం )ఎల్కతుర్తి (మండలం)
కరీంనగర్ (జిల్లా)
 ఎం.ఏ (తెలుగు) 1971 -73   ఓ.యు
పి .హెచ్ డి అంశం :"ప్రాచీనాంధ్రకావ్యాల్లో జానపద విజ్ఞానం " 

                         ఆచార్య నాయని కృష్ణకుమారి గారి పర్యవేక్షణలో 
ఉద్యోగ బాధ్యతలు :
 

1.శ్రీ లక్ష్మీనరసింహా స్వామి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 

      1 - 7 -1974 నుండి 10 -12 -1984 వరకు
2.ఓ.యు అకడమిక్ ఆడిట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ గా 

         11 -12 -1984 నుండి 2 - 10 -1991 వరకు
3.1991 వ సంవత్సరంలో ఓ.యు తెలుగు శాఖలో కి ప్రవేశించారు. ...

      అసిస్టెంట్ ప్రొఫెసర్ గా , అసోసియేట్ ప్రొఫెసర్ గా ..
           {3 -10 - 1991 నుండి 26 -3 -1999 వరకు}
4.  ప్రొఫెసర్ గా 13 సంవత్సరాల అనుభవం
5.బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా  {31 -7 -2006 నుండి 31 -7 -2008 వరకు }
6.
ఓ.యు తెలుగు శాఖ అధ్యక్షులుగా {31 -7 -2008 నుండి 31 -7 -2010 వరకు }
ప్రత్యేకతలు : సుమారు 37 సంవత్సరాల  U.G.C సర్వీస్ ను కలిగి ఉండటం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి